‘భోళా శంకర్’ రిలీజ్ ఎప్పుడంటే ?

50
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఉగాది శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ మెగా అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆగస్ట్ 15న (మంగళవారం) స్వాతంత్ర్య దినోత్సవం సెలవు కావడంతో సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. అదే నెల 22న చిరంజీవి పుట్టినరోజు కూడా ఉంది.

చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా భాటియా ఉన్న తెలుగు దనం ఉట్టిపడే పోస్టర్ రిలీజ్ చేసి డేట్ ప్రకటించారు మేకర్స్. పోస్టర్ లో కీర్తి మరియు తమన్నా సోఫాలో హాయిగా కూర్చున్నారు, అందులో చిరంజీవి వారి వెనుక నిలబడి ఉన్నారు.

తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది. సుశాంత్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు.క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్ మెంట్స్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా వేదళం కి రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఇవి కూడా చదవండి…

ఆ రూమర్ పై RRR నిర్మాత రియాక్షన్

అన్నీ మంచి శకునములే టైటిల్‌ ట్రాక్ లాంచ్‌..

నిజాయితీగా పనిచేశా: విశ్వక్‌సేన్‌

- Advertisement -