తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మెజార్టీ గ్రామాల్లో ప్రదర్శించారంటే సినిమా ప్రజలకు ఏమేరకు కనెక్ట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రియదర్శి , కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.
తాజాగా ఈ సినిమా గురించిన ప్రశ్న ఇవాళ జరిగిన గ్రూప్ 4లో వచ్చింది. బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు..A.దర్శకుడు:వేణు యెల్దండి,B:నిర్మాత:దిల్ రాజు/హన్షితా రెడ్డి/హర్షిత్ రెడ్డి.C:సంగీత దర్శకుడు:భీమ్స్ సిసిరోలియో,D:కొమరయ్య పాత్రను పోషించినారు:ఆరుసం మధుసూధన్ అనే కాప్షన్స్ జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో బలగం మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కిందని చెప్పవచ్చు.
Also Read:జవాన్, సలార్ కు భారీ డిమాండ్