ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి-2 ట్రైలర్ రానేవచ్చింది. ‘బాహుబలి ‘ది బిగినింగ్’ చూసిన ఆడియెన్స్..బాహుబలి-2 కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా అభిమానులను ఊరిస్తూ వస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
తమిళంలో ముందుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై అభిమానుల్లో జోష్ ని పెంచింది. ప్రస్తుతం తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతుంది ఈ ట్రైలర్. ట్రైలర్ చాలా గ్రాండియర్ గా ఉండగా ఇందులో సినిమాకు సంబంధించిన పాత్రలు, పోరాట సన్నివేశాలు, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి-2 ఫస్ట్ పార్ట్ ని మించి ఉంటుందని ట్రైలర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ చిత్రంతో సమాధానం దొరకనుంది. త్వరలో ఈ సినిమా కూడా రిలీజవనుంది. ఇక ఈ రోజే రిలీజ్ అయిన బాహుబలి-2 ట్రైలర్..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.