బోరబండ డివిజన్‌లో బాబా ఫసియుద్దీన్ గెలుపు..

44
Baba Fasiuddin

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక డివిజన్ల ఫలితాలు వెలువడుతున్నాయి. బోరబండ డివిజన్‌లో డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ నేత బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. ఫసియుద్దీన్ గెలుపుతో బోరబండ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 42 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 8 డివిజన్లను తన ఖాతాలో వేసుకున్న ఎంఐఎం పార్టీ 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.