జక్కన్నా… ఇది స్పూర్తా..? కాపీ యా..?

271
Baahubali-2 New Look Poster Copy of Hollywood Poster ONG BAK2
- Advertisement -

సినిమాలను తెరకెక్కించడంలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభే వేరని నమ్ముతుంటారు మన తెలుగు ప్రేక్షకులు.  అది ముమ్మాటికీ  నిజమే అనుకున్నా…ఇప్పుడు అదే ప్రతిభ ఆయన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. రాజమౌళిమీద ఇప్పటికే చాలా కాపీ ఆరొపణలొచ్చాయి. ఆయన ప్రతి సినిమానూ ఏదో ఒక హాలీవుడ్ సినిమాతో ముడిపెడుతుంటారు కొంతమంది. అయితే  ‘బాహుబలి-2 ది కంక్లూజన్‌’ సినిమా పోస్టర్‌ కి కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

ఇప్పటికే ‘బాహుబలి’ విషయంలో జక్కన్న ఇలాంటి విమర్శల్ని ఎన్ని ఎదుర్కొన్నాడో..? ‘ది బిగినింగ్’కు సంబంధించిన థీమ్ పోస్టర్  (నీళ్లలోంచి చేతితో బిడ్డను ఎత్తుకున్నది) ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టిందంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అంతేకాకుండా ఇప్పుడు శివరాత్రి కానుకగా రిలీజ్ చేసిన ‘బాహుబలి-2’ పోస్టర్ విషయంలోనూ ఇలాంటి విమర్శలే మళ్ళీ వినిపిస్తున్నాయి.

అసలు ఇలాంటి విమర్శలు ఎందుకొస్తున్నాయో కూడా ప్రేక్షకులకు అంతుచిక్కడంలేదు. ఈ ప్రపంచంలో ఒకదాన్ని చూసి మరోకటి అనుసరించడం సహజమే. కానీ …దాన్ని స్పూర్తిగా తీసుకోవడమా..? లేదా దాన్నే అనుసరించడమా అనేది వారివారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది.  అయితే ఇందులో  గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడొచ్చే ప్రతి సినిమాలల్లో కొత్తదనం ఉండేలా దర్శకులు ఎలా ఆలోచిస్తున్నారో….ఆ సినిమాలను చూసే ప్రేక్షకులు కూడా  సినిమా సినిమాకి అప్‌డేట్‌ అవుతూ కొత్తగా ఆలోచిస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రేక్షకులు కూడా ఒక సినిమాలో వచ్చిన సీన్స్ ని, లేదా డైలాగ్స్‌ని ఎలా గుర్తిస్తున్నారో సినిమా పోస్టర్లని కూడా వారు గుర్తుపడుతున్నారన్నది కూడా వాస్తవం.
 Baahubali-2 New Look Poster Copy of Hollywood Poster ONG BAK2
అందుకే ఇప్పుడు ‘బాహుబలి-2’ పోస్టర్‌ పై వస్తున్న విమర్శలను అంత సులువుగా కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆంగ్ బాక్-2.. బాహుబలి-2 లేటెస్ట్ పోస్టర్లు రెండూ పక్క పక్కన పెట్టి చూస్తే..రెండింటికీ పోలికలున్నాయి. ఇదిలా ఉంటే..రాజమౌళి హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టడు కానీ.. స్ఫూర్తి పొందుతాడన్నది వాస్తవం. బేసిక్ ఐడియాను తీసుకుని.. మన నేటివిటీకి తగ్గట్లుగా దాన్ని మలచడంలో.. ఒరిజినల్ కంటే కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో రాజమౌళి దిట్ట. ఆ తరహలోకే వస్తుంది ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్టర్.  ఇందులో మనం గమనిస్తే…‘ఆంగ్ బాక్-2’ పోస్టర్ కంటే కూడా ‘బాహుబలి-2’ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇది పోస్టర్‌ చూసిన ప్రతి ఒక్కరికి కనబడుతున్న వాస్తవం. కాబట్టి ఈ విషయంలో మరీ రచ్చ చేయాల్సిన అవసరం లేదు.

కానీ… ‘ఆంగ్ బాక్-’ పోస్టర్ దీనికి స్ఫూర్తి అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ చర్చ మొదలైంది. నిజంగా రాజమౌళి కాపీ కొట్టడు కాబట్టే..ఆయన సినిమాలకి సంవత్సరాల సమయం పడుతుంది. అలాగని  తెలిసిన సినిమాలోని పోస్టర్‌ నే గుర్తొచ్చేలా బాహుబలి-2 పోస్టర్లుంటే…ఇక దానికోసం అంత సమయాన్ని వెచ్చించాల్సిన అవరసరమేముంది..? ఏదేమైనా ఈ రెండు పోస్టర్లలకు పోలికలున్నప్పటికీ బాహుబలి-2 పోస్టరే ఎక్కువ ఆకర్షణీయంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -