అనుష్క వల్ల బాహుబలి2కి లాస్‌..?

141

టాలీవుడ్‌లో సక్సెస్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్రేకగుర్తింపుని సంపాధించుకుంది ఈ స్వీటి. అనుష్క ఎలాంటి సినిమా చేసినా..ఆ సినిమా ప్రాఫిట్‌ పోందడం ఖాయం అనే అభిప్రాయం అందర్లోనూ ఉంది. కానీ ఇప్పుడు అనుష్క వల్ల ఏకంగా 20 కోట్లు నష్టపోవాల్సివచ్చిందట. అవును స్వీటీ శెట్టి అలియాస్‌ అనుష్క చేసిన ప‌నికి నిర్మాత‌లు ఏకంగా 20 కోట్లు న‌ష్ట‌పోయారంట.

 Baahubali Incurred 20 Cr Loss Because Of Anushka

అయితే .. స్వీటీ అనుష్క ప్ర‌స్తుతం ‘బాహుబ‌లి’లో కీల‌క నాయిక అన్న సంగ‌తి తెలిసిందే. ‘బాహుబ‌లి -1’లో దేవ‌సేన పాత్ర‌లో స్వీటీ అద‌ర‌గొట్టేసింది. అయితే తొలి భాగంలో త‌న పోర్ష‌న్ షూట్‌ పూర్త‌వ్వ‌గానే స్వీటీ వేరే సినిమాకి క‌మిటైంది. ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో ‘సైజ్ జీరో’ అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం స్వీటీ ఏకంగా 20 కేజీలు బ‌రువు పెరిగింది. ఆ సినిమా తర్వాత స్వీటి త‌న బ‌రువు త‌గ్గ‌డం కోసం నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది.

 Baahubali Incurred 20 Cr Loss Because Of Anushka

‘బాహుబ‌లి-1’ టైమ్‌లో స్లిమ్‌గా ఉన్న స్వీటీతో పార్ట్ -2 సీన్స్ కూడా చాలానే తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు. కానీ రెండో భాగం వ‌చ్చేప్ప‌టికి అనుష్క భారీ ఆకారం పాత గెట‌ప్‌తో మ్యాచ్ కాలేదు. దాంతో స్వీటీ కోసం చాలా కాలం ‘బాహుబ‌లి’ యూనిట్ ఎదురు చూడాల్సొచ్చింది. అనుష్క స‌న్న‌బ‌డ‌డం ఎప్ప‌టికీ సాధ్యం కాక‌పోవ‌డంతో ఇక మొత్తం పాత సీన్ల‌న్నీ రీషూట్ చేయాల్సొచ్చిందిట‌. అలా రీషూట్లు చెయ్యడానికి నిర్మాత‌లు అద‌నంగా 20 కోట్లు ఖ‌ర్చు చేయాల్సివచ్చందట. అందుకే అనుష్క వల్ల 20కోట్లు నష్టపోయారని అంటున్నారు. దీంతో బాహుబలి2 సినిమాకి బడ్జెట్‌ పరంగా అనుష్క నష్టం కలిగించిందని టాక్‌.

More Stories:

ప్రభాస్ గురించి జక్కన్న ఏమన్నాడు..?

బాహుబలిని ఎందుకు చంపానో తెలుసా…?: కట్టప్ప

ప్రభాస్‌కు అవేమీ చేతకాదు..!

రాజమౌళి కంటతడి..

బాహుబలి.. మళ్లీ వస్తున్నాడు!