- Advertisement -
ఆయూష్ వైద్యుల పదవీవిరమణ వయస్సుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టానికి సవరణ చేసింది .
వైద్యశాఖ పరిధిలోని అల్లోపతి వైద్యుల పదవీ విరమణ వయస్సును ఇటీవలె పెంచగా తమకు పెంచాలని ఆయుష్ వైద్యులు కోరారు. దీనికి అంగీకరించిన సీఎం…ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించగా కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
- Advertisement -