ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో సుహాస్, రుహానీ శర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం శ్రీరంగ నీతులు. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాఇటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మే 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోండగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆహాలో వచ్చిన కలర్ ఫోటో సినిమాతోనే సుహాస్‌కి మంచి పేరు రాగా తాజాగా శ్రీరంగనీతులు కూడా మంచి వ్యూస్ రాబడుతోంది. వెంకటేశ్వరరావు బల్మూరి ఈ సినిమాను నిర్మించారు.
మూడు కథలతో ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. శివ(సుహాస్) ఓ బస్తిలో ఉంటూ జాబ్ చేస్తూ ఉంటాడు. బస్తీలో కుర్రాళ్ళ మధ్య గొప్పగా ఉండాలని ఫ్లెక్సీల పిచ్చితో ఆ ఏరియా రాజకీయ నాయకుడితో ఫొటో దిగి గ్రౌండ్ లో పెద్ద ఫ్లెక్సీ వేయిస్తాడు. తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు. దీంతో ఆ ఫ్లెక్సీ కోసం గొడవతో సాగుతుంది. ఇంకో కథలో.. ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమించుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే నేపథ్యంలో తెరకెక్కించారు. ఇక మూడో కథలో సక్సెస్ కానీ ఓ యువకుడు మందు,సిగరేట్,గంజాయికి బానిస అవడం నేపథ్యంలో తీశారు.
Also Read:ట్రంప్ దోషి..యుఎస్ చరిత్రలో తొలిసారి!

