సెకండ్ హ్యాండ్ వస్తువులు, కార్లు, బైకులు కొనుకోవడం సర్వసాధారణం. కొత్తవి కొనడానికి స్థోమత లేని వారు, మధ్యతరగతి కుటుంబీకులు సెకండ్ హ్యాండ్ లో కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. సెకండ్ హ్యాండ్ వస్తువుల కోసం ఆఫ్ లైన్ స్ట్రోర్స్ లేదా ఆన్లైన్ లో ఓఎల్ఎక్స్ వంటి యాప్స్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన కార్లు లేదా బైకులు తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ లో దొరకడంతో మురిసిపోతుంటారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా సెకండ్ హ్యాండ్ కార్లు గాని బైకులు గాని కొనుగోలు చేసి తరువాత వాటి విషయంలో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి సెకండ్ హ్యాండ్ లో కార్స్ లేదా బైక్స్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.!
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
ఏదైనా వెహికల్ సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేసేటప్పుడు ఆ వాహనం యొక్క ఆర్ సి తప్పనిసరి గా చెక్ చేయాలి. ఆర్ సి అమ్మకపు దారుడి పేరు మీద ఉందో లేదో చెక్ చేయడం మంచిది. ఎందుకంటే ఇతరుల వాహనాలను దొంగిలించే అమ్మే అవకాశాలు ఉన్నాయి.
వాహన కొనుగోలు పత్రం
వాహనం కొత్తగా కొనుగోలు చేసినప్పటికీ రశీదు, ఇతరత్రా పత్రాలు కూడా తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎందుకంటే వాటి ద్వారా వాహనం యొక్క కండిషన్ ను అంచనా వేయవచ్చు.
ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్
ఏదైనా వెయికిల్ కొనుగోలు చేసేటప్పుడు ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ చెక్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వాహనం గతంలో ఏమైనా ప్రమాదలకు గురైన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకా సర్వీస్ రికార్డ్ బుక్, ఎన్ ఓ సి సర్టిఫికేట్ వంటివి కూడా తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇవన్నీ అమ్మకపు దారుడి వద్ద ఉన్నప్పుడే వాహనం సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలి.
Also Read:Pushpa 2: నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు
ఒకవేళ అమ్మకపు దారుడు ఇవేవీ లేవని సమాధానం చెప్పినప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ ( CCTNS ) లో రిజిస్టర్ అయి వాహనం యొక్క నెంబర్ ఎంటర్ చేస్తే వాహనం యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఇలా అన్నీ చెక్ చేసిన తరువాతనే కారు లేదా బైక్ సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వాహనాలు వస్తున్నాయని వెంటనే ఏవి చెక్ చేయకుండా కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది.