‘అవతార్ 2’ టీజర్ ట్రైలర్‌ వచ్చేసింది..

54
Avatar 2
- Advertisement -

దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకి తాజాగా తెరపడింది. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ టీజర్ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ చిత్రం ఎటువంటి ప్రభజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవతార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సీక్వెల్ అవతార్ 2 టీజర్ ట్రైలర్‌ను వదిలారు మేకర్స్‌.

ఆ ట్రైలర్ చూస్తే కామెరూన్ మరోసారి విజువల్స్‌తో మ్యాజిక్ చేయనున్నాడని అర్థమవుతోంది. అందులో మొదటి పార్ట్ క్యారెక్టర్స్‌ని కొనసాగిస్తూ జేక్ సల్లీగా సామ్ వర్తింగ్టన్, నేటిరిగా జో సల్దానా కనిపించనున్నారు. అంతేకాకుండా మొదటి భాగం ఆకాశంలో జరిగితే.. ఈ పార్ట్‌లో ఎక్కువ భాగం సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే నీటి మీద జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజువల్స్ కూడా మొదటి పార్ట్‌ని మించి ఉంటాయని అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 16న థియేటర్స్ విడుదలకానుంది. అంతేకాదు 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 కూడా విడుదల కానున్నాయని సమాచారం.

- Advertisement -