అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ @డిసెంబర్‌16!

60
avatar
- Advertisement -

సినిమా అంటే ప్రేక్షకుని ఇట్టే కట్టిపడేసి విజువల్స్‌ ఉండాలి. అలాంటి సృజనాత్మకంగా తీసే సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల కనక వర్షం కురుస్తోంది. భారతీయ సినిమా అంటే సాంఘిక నేపథ్యం, కథ, కథనం తీసే విధానం అన్ని సమపాళల్లో ఉండాలి లేదంటే అది బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడుతుంది. అలాంటి సినిమాలు హాలీవుడ్‌లో తీస్తే మాత్రం చప్పగా ఉంటుంది. గ్రాఫిక్స్‌, విజువల్స్‌ ఎఫెక్ట్‌, ఫోటో రియలిస్టిక్ సీజీఐ, మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ లాంటీ పేర్లు పలకడానికి వీలు లేని టెక్నాలజీలు ఉపయోగించి తీస్తారు. అలా తీసిన సినిమాలో ఒకటి అవతార్‌.

అవతార్‌ ను 1994లో కథ రెడీ చేసుకున్న జేమ్స్‌ కామోరూన్‌ సూమారుగా ఒక దశాబ్దం వరకు వేచి 2007లో మొదలు పెట్టి….. 2009 డిసెంబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అనేక సాంకేతిక హంగులతో తీసిన ఈ సినిమాకు అయిన ఖర్చు దాదాపుగా 237 మిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో చెప్పాలంటే సూమారుగా రూ. 1196 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా తీస్తే…..2.80 బిలియన్‌ డాలర్లు (రూ.13555 కోట్లు) వసూళ్లును రాబట్టింది.

అవతార్‌ సినిమాను సిక్వెల్స్ కథలను రెడీ చేయడానికి చిత్ర నిర్మాతలకు, జేమ్స్‌కు ఒక దశాబ్దం పట్టింది. అవతార్‌ సీరిస్‌తో మొత్తం 4 భాగాల్లో తీయనున్నారు. ప్రస్తుతం జేమ్స్‌ అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ రెండవ భాగంను తీస్తున్నారు. తాజాగా రెండవ భాగం ముగింపు దశకు చేరుకుందని అంతర్జాతీయ మీడియా ప్రచారం. హలీవుడ్‌లో ది టాక్‌ ఆఫ్‌ ది గా అవతార్‌ ది వే ఆఫ్‌ వాటర్‌ సెకండ్‌ సీరిస్‌పైన అందరి కళ్లు ఉన్నాయి. ఇది డిసెంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని జేమ్స్‌ ప్రకటించారు. మూడవ భాగంను 2024లోనూ, నాలగవ భాగంను 2026లో విడుదల చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -