తొలి టీ20లో భారత్ ఓటమి

156
- Advertisement -

ఆసీస్‌తో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమి పాలైంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా చేధించింది. 209 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కొల్పోయి 211 పరుగులు చేసింది. ఆరంభం నుండే భారత బౌలర్లపై విరుచుకపడ్డ ఆసీస్ ఆటగాళ్లు భారత బౌలర్లను చిత్తుచేశారు.

ఆసీస్ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ హాఫ్ సెంచరీతో 30 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. తర్వాత మ్యాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45*), స్టీవెత్ స్మిత్ (24 బంతుల్లో 35 పరుగులు) రాణించడంతో ఆసీస్ విజయం ఖాయమైంది.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 55 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (25 బంతుల్లో 46 పరుగులు) చేశారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసక బ్యాటింగ్ తో ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపించాయి. కేవలం 30 బంతుల్లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 23న నాగపూర్ లో జరగనుంది.

- Advertisement -