అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

57
- Advertisement -

గుండెపోటుకు గురై కోమాలోకి వెళ్లిన సినీ నటుడు నందమూరి తారకరత్న కి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఇవాళ తారకరత్న బ్రెయిన్ స్కాన్ చేశారు. అయితే, ఆ రిపోర్ట్స్ ప్రకారం.. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు విదేశాల నుంచి వచ్చిన వైద్యులు మెదడుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నారు.

గత 22 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సాయంత్రం తారకరత్న హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అంతర్గత రక్తస్రావం, తారకరత్న మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారని తెలుస్తోంది.

ఇన్నాళ్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుందని.. అందరూ భావించారు. అలాంటిది మళ్ళీ క్రిటికల్ కండిషన్ అని వార్తలు రావడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి…

మైఖేల్ ఓటీటీలోకి ఎప్పుడంటే…

భోళా శంకర్‌లో రీమేక్ సాంగ్‌…

బాలయ్య కొత్త షెడ్యూల్ ఖరారు

- Advertisement -