మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు తాజా హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ఎయిమ్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అటు మరోవైపు వాజ్ పేయి ఆరోగ్యం క్రిటికల్ గా ఉండడంతో ఆయనను ఇప్పటికే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పరామర్శించారు. అటు కేంద్ర మంత్రులు, బీజేపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఆస్పత్రికి వచ్చి వాజ్‌పేయిని పరామర్శిస్తున్నారు. వాజ్‌పేయి కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు.
వాజ్ పేయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఎయిమ్స్ దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగుపడాలంటూ యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులు వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.