యూపీలో రైలు ప్రమాదం..!

259
At Least 23 Killed, 40 Injured As Utkal Express Derails In UP's Muzaffarnagar
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌- కళింగ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. సాయంత్రం 5.46 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైలు బోగీలు పట్టాలు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న వారు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి 30 పైగా అంబులెన్సులు చేరుకున్నాయి. పూరీ నుంచి హరిద్వార్‌ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.

At Least 23 Killed, 40 Injured As Utkal Express Derails In UP's Muzaffarnagar

ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు వెంటనే స్పందించారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలికి రైల్వే సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా వెళుతున్నారని సురేశ్‌ ప్రభు తెలిపారు. ప్రమాద స్థలికి అంబులెన్సులు చేరుకున్నాయని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

రైలు ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

At Least 23 Killed, 40 Injured As Utkal Express Derails In UP's Muzaffarnagar

రైలు ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వారికి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రైలు ప్రమాద ఘటన దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -