ఆకట్టుకుంటున్న ‘అశ్వథ్థామ’ ట్రైలర్..

371
Aswathama

నాగశౌర్య.. మెహ్రీన్ లు హీరో హీరోయిన్లుగా నూత దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31 న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్.. టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. యాక్షన్ -- ఎమోషన్ .. ఛేజింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే ఒక మర్డర్ మిస్టరీని హీరో ఛేదించడమే ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. “ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు .. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు .. వేట కుక్కల్లా వెంటపడే జాలరులు .. శకునిలాంటి ఒక ముసలోడు. వీళ్లందరినీ ఒకే స్టేజ్ పై ఆడిస్తున్న సూత్రధారి ఎవరు?” అనే నాగశౌర్య డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.