మహారాష్ట్రలోని బరామతి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ ఆకాశ్ మోర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికలో ఆయన, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎన్‌సీపీ నాయకురాలు సునేత్ర పవార్‌కు ప్రత్యర్థిగా నిలవనున్నారు.
అజిత్ పవార్.. జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమమైంది. ఆకాశ్ మోర్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తండ్రి విజయరావ్ మోర్ మహారాష్ట్ర శాసన మండలి (MLC) సభ్యుడిగా పనిచేశారు.
అయితే సునేత్ర పవార్… మాత్రం తాను పోటీ చేస్తున్న బరామతి స్థానానికి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన (UBT) ఈ అంశంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక, ఎన్‌సీపీ (షరద్ పవార్ వర్గం) ఇప్పటికే ఈ ఉపఎన్నికలో పోటీ చేయబోమని ప్రకటించింది. బరామతి నియోజకవర్గాన్ని ప్రతినిధ్యం వహించిన అజిత్ పవార్ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఆమె భర్త అజిత్ పవార్ బరామతి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024లో కూడా తన మేనల్లుడు యుగేంద్ర పవార్‌ను ఓడించి లక్షకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
ALso Read:కొత్త కాన్సెప్ట్‌తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ!
బరామతి తో పాటు అహిల్యానగర్ జిల్లాలోని రాహురి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఏప్రిల్ 23న ఉపఎన్నిక జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యే శివాజీ కార్డిలే మరణంతో ఈ ఉపఎన్నిక అవసరమైంది.

