భారత్ వర్సెస్‌ పాక్‌..తేలిగ్గా తీసుకుంటే కష్టమే

227
india_pakistan
- Advertisement -

ఆసియా కప్ సంగ్రామంలో ఆసక్తిర పోరుకు సర్వం సిద్ధమైంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడనున్నాయి. హంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు భారత్-పాక్‌ మ్యాచ్‌పైనే ఉన్నాయి.

ఎందుకంటే ఈ దాయాదుల మ్యాచ్‌కు ఉండే అటెన్షన్‌ అలాంటింది. అది లీగ్‌ మ్యాచ్‌ కావొచ్చు, నాకౌట్‌ మ్యాచ్‌ కావొచ్చు.. టైటిల్‌ కోసం తలపడే మ్యాచ్‌ కావొచ్చు..ఏదైనా సరే ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లోనే కాదు..ప్రజానీకంలోనూ ఒకటే ఉత్కంఠ. తమ జట్టు గెలవాలంటే తమ జట్టే గెలవాలని ఇరుదేశాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపిన సందర్భాలున్నాయి. తాజాగా మరోసారి ఆసియా కప్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఎదుచూస్తున్నారు.

ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కి తిరుగులేని రికార్డ్‌ వుంది. ఆ లెక్కన, భారత్‌ గెలుపు నల్లేరు మీద నడకేనన్నది క్రికెట్‌ విశ్లేషకుల వాదన. ఇక ఒత్తిడిలో రాణించడం పాక్‌ ప్రత్యేకత. చాలా సందర్భాల్లో ఒత్తిడిని తట్టుకుని భారత్‌పై పైచేయి సాధించింది పాక్‌.

india vs pakisthan

కొన్ని మ్యాచ్‌ల్లో జట్టకు నాయకత్వం వహించిన రోహిత్‌ తొలిసారి ఒక పెద్ద టోర్నీలో టీమిండియాను నడిపించబోతున్నాడు. ఓవైపు కోహ్లి లేని లోటు.. మరోవైపు బలమైన, ప్రమాదకర ప్రత్యర్థులు.. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను నిలబెట్టుకోవడం టీమ్‌ఇండియాకు సవాలే అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌లో భారత్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఆసియా కప్‌లో టీమ్‌ఇండియాకు ఓపెనింగ్‌ మరింత కీలకం కానుంది. మూడో స్థానంలో వచ్చే కీలక ఆటగాడు కోహ్లి దూరం కావడంతో ఓపెనర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లపై భారం పడనుంది. వాళ్లిద్దరూ శుభారంభాలు అందించకుంటే జట్టుకు కష్టాలు తప్పవు. గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌కు పాక్‌ ఇచ్చిన షాక్‌ను అభిమానులు ఇంకా మరిచిపోలేదు. దీంతో బుధవారం జరిగే మహాసంగ్రామంలో ఎవరు గెలుస్తారో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -