అభినందన్‌ కోసం అభిమానుల ఎదురుచూపు..

242
- Advertisement -

భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను ఈరోజు విడుదల చేస్తామని పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాఘా అత్తారి బోర్డ‌ర్ వ‌ద్ద పాక్ అధికారులు అభినంద‌న్‌ను భార‌త్‌కు అప్ప‌గిస్తార‌ని మంత్రి ఖురేషి కూడా వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో వాయుసేన అధికారులతో పాటు వర్ధమాన్ కుటుంబ సభ్యులు, పలువురు సాధారణ పౌరులు పంజాబ్ లోని అట్టారి బోర్డర్ వద్దకు చేరుకున్నారు.. అభినందన్‌ను భార‌తీయ దౌత్య అధికారులు రిసీవ్ చేసుకోనున్నారు.

IAF pilot Abhinandan

అభినంద‌న్‌కు స్వాగ‌తం ప‌లికేందుకు భారీ సంఖ్య‌లో వాఘా బోర్డ‌ర్‌కు జ‌నం తరలివస్తున్నారు.. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ ద‌ళాలు కూడా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వ‌ర్ద‌మాన్ రిలీజ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల ప్రాసెసింగ్‌ను పాక్‌లోని భార‌త దౌత్య కార్యాల‌యం పూర్తి చేసింది. అయితే అభినందన్‌ను మరికొద్ది గంటల్లో విడుదల చేస్తారని అనుకుంటున్న సమయంలో కొత్త ట్విస్ట్ అందరికీ షాకిచ్చింది. పాకిస్థాన్ తమ అదుపులోని అభినందన్‌ను ఎలా విడుదల చేస్తుందంటూ ఆ దేశానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

- Advertisement -