టీఆర్ఎస్‌ గెలుపు కోసం ఎన్ఆర్‌ఐల హోమం

217
trs uk cell

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎన్నారై టీఆర్ఎస్ తెలిపింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్  ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గెలుపుకోసం  లక్ష్మీ గణపతి హోమం చేశారు.  ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలకు హాజరయ్యారు.

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. ఎన్నారైలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు అని కొనియాడారు అనిల్ కుర్మాచలం. ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమవుతుందన్నారు.

కొండగట్టు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసరీ వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.