లాక్‌డౌన్‌…ఇంట్లోనే తారావీహ్‌ ప్రార్ధనలు

269
owaisi

దేశంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా ఏప్రిల్ 20 నుండి సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెలలోనే రంజాన్ ప్రారంభకానుండటంతో ముస్లి సోదరులంతా రంజాన్ తారావీహ్‌ నమాజ్‌లను ఇళ్లలోనే చేసుకోవాలని జామియా – నిజామియా కమిటి ఓ ప్రకటనలో తెలిపింది.

దీనిని స్వాగతించారు ఎంఐఎం నేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినందున ఇదో మంచి విజ్ఞప్తిగా పేర్కొన్నారు. అన్ని ముస్లిమ్‌ పాఠశాలలకూ మార్గదర్శకాలు జారీ చేశారని, వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కచ్చితంగా పాటించాలన్నారు.

రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా సహర్‌తో పాటు ఇఫ్తార్‌లను కూడా ఇళ్లలోనే చేసుకోవాలని కమిటీ కోరింది. డబ్బులు వృథా చేయకుండా పేదలకు చేయూత అందించాలని, లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపింది.