టాలీవుడ్ లో ప్రభాస్ ఎలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరో తమిళ ఇండస్ట్రీలో ఆర్య కూడా అలాగే. ఈయనకు కూడా ఫాలోయింగ్ ఓ రేంజిలోనే ఉంది. ఈ స్టార్ హీరో ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ హల్ చల్ చేస్తోంది. ఇంతకు ఆర్య ఏం కామెంట్ చేశాడు అని అనుకుంటున్నారా… ఆర్యకు ఇప్పుడు ఏకంగా ‘నాకొక పెళ్ళాం కావలెను’ అంటూ రియల్ లైఫ్ లోనే బహిరంగ ప్రకటన విడుదల చేశాడు. ఆర్యది కేరళనే అయినా తమిళంలో స్థిరపడ్డారు. కోలీవుడ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా బాగా పేరున్న ఏళ్ల ఆర్య మనసు ఇప్పుడు పెళ్లిపై పడింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఈ మోస్ట్ బ్యాచిలర్ మనసులో మొదలైంది.
అయితే ఈయనకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదట. దాంతో తనకు అమ్మాయిని వెతికి పెట్టే పనిని అభిమానులకే అప్పజెప్పారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి నేను నా జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నాను. ఇది కామెడీకాదు. నా జీవితం. నేను నిజంగానే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరైనా తెలిస్తే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పండి’ అని ఆర్య వీడియోలో పేర్కొన్నారు.సాధారణంగా కుటుంబ సభ్యుల ద్వారానో.. ఫ్రెండ్స్ సాయంతోనో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతుంటారు. కానీ నేను అలా కాదు. పెళ్లి విషయంలో నాకు ఎలాంటి డిమాండ్స్ కానీ.. కండీషన్స్ కానీ లేవు. నేను మీకు నచ్చితే.. ఆ అమ్మాయికి చక్కటి జోడీ అవుతానని అనిపిస్తే నా నంబర్- 73301-73301కి కాల్ చేయండి. ఇది ఫేక్ కాదు. నా లైఫ్.” అని ఆర్య వీడియోలో వెల్లడించారు.
Hi Friends 😊 Finally In search of my Life Partner 😍😍😍#MySoulmate ❤️❤️❤️ pic.twitter.com/zq88lIoglY
— Arya (@arya_offl) November 21, 2017