ఆర్య…’మిస్టర్. X’ప్రారంభం

10
- Advertisement -

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. స్టార్ యాక్టర్ శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైయింది. ఈ షెడ్యుల్ లో హీరోలు ఆర్య & గౌతమ్ తో పాటు ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తారు. ఈ మేరకు షూటింగ్ స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్.

“మిస్టర్ X” లోని యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.

Also Read:ఆలు పాలతో ఎన్ని ఉపయోగాలో..!

రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత. మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -