నూతన ఎంపీల కోసం లోక్‌సభ సచివాలయంలో అన్ని విధాల ఏర్పాట్ల చేస్తునట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీ వాస్తవ వెల్లడించారు. కొత్త ఎంపీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని.. దానికోసం 56 నోడల్ ఆఫీసర్లను నియమించాం. వీరంతా కొత్తగా ఎంపికైన ఎంపీలతో టచ్‌లో ఉంటారు. వారు రిజిస్ట్రేషన్ ఫారాలు, ఎన్నిక ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి ఆమె తెలిపారు.
దీనిక సంబంధించి పార్ట్-1ను ఆన్‌లైన్‌లో కూడా సమాచారం నింపి ఇచ్చే అవకాశం ఇచ్చాం. పార్ట్ – 2 లో వివరాలను రెండు మూడు రోజులు తర్వాతైనా ఇవ్వొచ్చు. ఎంపీలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. ఏ భాషలో ప్రమాణం చేస్తారనేదానిపై ముందుగానే ఎంపీలు సమాచారమివ్వాలి.ఎంపీలంతా తమ ఫొటోగ్రాఫ్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్‌లో ఎంపీలకు స్వాగత డెస్క్‌లు ఏర్పాటు చేశాం అన్నారు. వారికి అవసరమైన పోలీసు భద్రతను కూడా కల్పిస్తున్నాం.ఎంపీలకు సెక్యూరిటీ ఫీచర్స్‌తో ఐడెంటిటి కార్డులు, పార్లమెంటు మ్యానువల్స్‌కు సంబంధించిన బ్రీఫ్ కేస్, రాజ్యాంగం పుస్తకాలను అందిస్తాం.
లోక్ సభ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాలు, పెన్ డ్రైవ్ ఇస్తున్నాం. ఎంపీలకు స్టేట్ గెస్ట్ హౌస్‌లు, వెస్ట్రన్ హౌస్‌లలో వసతులు కల్పించాం. వెస్ట్రన్ కోర్టులో వంద గదులు అందుబాటులో ఉన్నాయి..స్టేట్ గెస్ట్ హౌస్‌లో కావాల్సినని గదులున్నాయి.. ఈ గదుల్లో తాత్కాలిక వసతి సదుపాయం కల్పిస్తున్నాము. అంతేకాకుండా వసతికి సంబంధించి 24 గంటల సేవలందించే డెస్క్ కూడా ఏర్పాటు చేశాం. పేపర్ వర్క్ తగ్గించి, డిజిటల్ ద్వారానే సేవలు అందించే ఏర్పాట్లు చేశాస్తున్నామని లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీ వాస్తవ వివరించారు.
Arrangements on to welcome New MPs