మళ్ళీ పార్లమెంట్ లోకి రాహుల్..మోడీకి షాక్!

53
- Advertisement -

రాహుల్ గాంధీ గత ఎన్నికల ముందు మోడీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని బీజేపీ నేతలు పరువు నష్టదావా కింద గుజరాత్ లోని సూరత్ కోర్టులో కేసు వేయగా.. రాహుల్ గాంధీపై రెండేళ్ళు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా రాహుల్ గాంధీ తాత్కాలికంగా ఎంపీ పదవిని కోల్పోయి పార్లమెంట్ కు దూరంగా ఉంటున్నారు. అయితే తనపై ఆ కేసు కక్ష పూరితమే అని రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ కేసు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. నేడు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం సూరత్ కోర్టు విధించిన అనర్హత వేటు పై సుప్రీం కోర్టు స్టే విధిస్తూ తీర్పునిచ్చింది..

దీంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీ పై ఉన్న అనర్హత వేటు తాత్కాలికంగా నిలిపివేసినట్లైంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కక్ష పూరిత వ్యవహారానికి సుప్రీం కోర్టు చెప్పపెట్టులా తీర్పునిచ్చిందని సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేధికగా స్పందించారు. ” ఏదైనా జరగని, ఏదైనా రాని దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన ” అంటూ ట్వీట్ చేశారు.

పరువు నష్టం కేసు పై స్టే విధించడంతో రాహుల్ గాంధీ ఎప్పటి నుంచి పార్లమెంట్ కు వెలతారనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైందని, ఈ సమావేశాల్లోనే రాహుల్ పాల్గొంటారని కాంగ్రెస్ నేత సింఘ్వీ చెప్పుకొచ్చారు. అటు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని లోక్ సభ స్పీకర్ కు కాంగ్రెస్ ఎంపీలు అందజేసి రాహుల్ పై ఉన్న అనర్హత వేటును ఎత్తివేయాలని కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కోరారు. మొత్తానికి రాహుల్ గాంధీ పై ఉన్న అనర్హత వేటుపై స్టే రావడంతో పార్లమెంట్ లో రాహుల్ మోడీ సర్కార్ పై ఎలాంటి విమర్శలు ఎక్కుబెడతారు ? రాహుల్ తదుపరి వ్యూహరచన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read:సీనియర్స్ కు చెక్ పెడుతున్న జూనియర్స్?

- Advertisement -