మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత..వీర రాఘవ’. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా నేడు ఎన్టీఆర్ 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నిన్న (శనివారం) విడుదల చేశారు చిత్రయూనిట్.
ఈ ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని సిక్స్ ప్యాక్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే, ఎన్టీఆర్ ఓ గట్టుపై కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ కనిపిస్తున్నారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వీరిద్దరి కెమెస్ట్రీ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది.
ఇక ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మధ్యే కథానాయిక పూజా హెగ్డే షూటింగ్‌లో పాల్గనడంతో చిత్రీకరణ మరింత వేగవంతంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక త్రివిక్రమ్ గతంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా బక్సాఫీస్ వద్ద బొల్తాపడటంతో తారక్‌తో ఎలాగైన భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడట.
https://www.youtube.com/watch?v=TXwocB_kYuw