తారక్‌ నువ్వు మిస్సయ్యావ్‌; పూజా హెగ్డే

310
aravinda sametha veera raghava
- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం అరవింద స‌మేత వీర రాఘ‌వ‌. ఈసినిమాకు సంబంధించి ఇటివ‌లే ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడులైన ఈసినిమా ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించిన విష‌యం తెలిసిందే. జైల‌వ కుశ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా ఇది. ఈసినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా పూజా హెగ్దె న‌టిస్తోంది. ఈ సినిమాలో రాఘ‌వ పాత్ర‌లో ఎన్టీఆర్, అర‌వింద పాత్ర‌లో పూజా హెగ్దె న‌టిస్తోంది.

aravinda sametha veera raghava

రాయ‌ల‌సీమ చ‌రిత్ర నేప‌థ్యంలో ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తీసిన అజ్ఞాత‌వాసి సినిమా అనుకున్నంత విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో..ఈసినిమాను చాలా జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కిస్తున్నాడు. ఈసినిమా కోసం ఎన్టీఆర్ ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్ వ‌ద్ద జిమ్ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 20 కిలోల వ‌ర‌కూ బ‌రువు త‌గ్గాడు. ఈసినిమాకు సంబంధించి పూజా హెగ్దె త‌న ట్వీట్ట‌ర్ లో ఒక విష‌యాన్ని తెలిపింది.

అరవింద స‌మేత సినిమా మొద‌టి షెడ్యూల్ లో  త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ పూరైన‌ట్టు ఒక ఫోటో పోస్ట్ చేసి తెలిపింది. ఈసంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ తో క‌లిసి దిగిన ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. అర‌వింద స‌మేత చిత్రంలో నా షెడ్యూల్ నేటితో పూర్తైంది. రోజూ సెట్ కి రావ‌డం చాలా ఉత్సాహంగా అనిపించేది అని తెలిపింది. ఈ ఫోటోలో తారక్ నువ్వు మిస్స‌య్యావ్.. మ‌రోసారి క‌లిసి ఫోటో దిగుదాం అంటూ పూజా హెగ్దె ట్వీట్ చేసింది. ఈసినిమాలో తార‌క్ స‌ర‌స‌న కాజల్ ఐటెం సాంగ్ చేయ‌నుంది. జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు ఈసినిమాలో కీల‌క‌పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. త‌మ‌న్ ఈసినిమాకు సంగీతం అందించ‌గా…రాథాకృష్ణ‌(చిన్న‌బాబు) నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ద‌స‌రా కానుక‌గా ఈమూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -