నాని ని టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి..

215

తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటి వరకు ఎన్నో సంచలన ఆరోపణలు చేసి ప్రకంపణలు సృష్టించిన నటి శ్రీరెడ్డి ఆ మద్య అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో విషయం కాస్త నేషనల్ స్థాయికి చేరుకుంది. దాంతో ఆమెకు మహిళా సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు మద్దతు పలికారు. ఇక తాను చేస్తున్న పోరాటానికి మరింత బలం వచ్చిందని భావించిన శ్రీరెడ్డి నోటికి అదుపు లేకుండా పోవడం..ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి చిట్టాలు విప్పుతానని హెచ్చరికలు చేయడం తెలిసిందే.

Sri Reddy

అయితే ఈ అమ్మడి రూట్ ఏంటో ఇప్పటికి ఓ క్లారిటీ రావడం లేదని సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం నాని ని పర్సనల్ గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. నీ కాపురంలో నిప్పులే అనేట్టుగా కామెంట్ చేసింది అంటే.. డోస్ ఏ లెవెల్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అలాగే నాని + శ్రీ రెడ్డి = డర్టీ పిక్చర్ అంటూ.. కమింగ్ సూన్ అంటూనే నానిని ధూషించింది ఈ అమ్మడు.

నాని గాడి రాసలీలలు అన్ని బయట పెడతా – కాసుకోర నాని – నీ కాపురం లో నిప్పులే అంటూ.. ఫ్యామిలీ ఎమోజి ని యాడ్ చేసింది. శ్రీరెడ్డి ఈ లెవెల్లో అంటుంటే నెటిజన్స్ ఊరుకుంటారా? వారి స్టైల్ లో వాళ్లు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. మొన్న పవన్.. నిన్న రానా.. ఈ రోజు నాని.. ఇక రేపు ఎవరో అని కామెంట్ చేస్తున్నారు. నాని నెక్స్ట్ బిగ్ బాస్ లో హోస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతనికి ఇప్పుడు క్రేజ్ ఎక్కువ కాబట్టి కావాలనే టార్గెట్ చేసినట్లు మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.