రెహ్మాన్ 2.0..’సర్వం తాళమయం’

287
Sarvam Thaalamayam
- Advertisement -

రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్వం తాళమయం. డిసెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేయగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్‌ రెహ్మాన్ విడుదల చేశారు.

మైండ్‌స్క్రీన్ సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ని విడుదల చేయగా అది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ‘మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా.. గర్వాలా ఆటే ఆడి ఆగేనే తుదిగా.. గగనాలే గర్జించేను తలబడితే మేఘాలే..’ అంటూ ఈ పాట సాగుతోంది. సంగీతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని
అందించాడు.

జీవీ ప్రకాష్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా…. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.రవి యాదవ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత నిర్మిస్తున్నారు. తెలుగులోనూ తమిళ టైటిల్ తోనే విడుదలవుతోంది.

- Advertisement -