100 బాల్స్ క్రికెట్….

238
100 balls cricket
- Advertisement -

వన్డే,టెస్టు,టీ20 సిరీస్‌లను మాత్రమే ఇప్పటివరకు మనం చూసుంటాం. ఇంకాస్తా ముందుకు వెళ్తే పింక్‌ బాల్‌,డే అండ్ నైట్ టెస్టులను కూడా చూశాం. తాజాగా మరో ఫార్మాట్‌ క్రికెట్ లవర్స్‌ని అలరించబోతోంది. ఈ సరికొత్త ఫార్మాట్‌కు పచ్చ జెండా ఉపింది ఇంగ్లాండ్.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ 2020 లో ప్రారంభం కానున్న 100-బాల్ క్రికెట్ పోటీకి కొత్త నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ నిబంధనలు సైతం అందరిని ఆశ్చర్యపర్చేలా ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో ప్రతి జట్టు 100 బాల్స్ ఆడుతుంది. ఇప్పటివరకు ఒక ఓవర్‌కి ఆరు బాల్స్‌ మాత్రమే కాగా ఈ ఫార్మాట్‌లో ఒక్కో ఓవర్‌లో పది బాల్స్ ఉంటాయి.

ఇప్పటివరకు ఒక బౌలర్‌ ఓవర్ వేసిన తర్వాత వేరే బౌలర్‌ మరో ఓవర్ వేస్తాడు. కానీ ఈ ఫార్మాట్‌లో ఒక్కో బౌలర్ 5 నుండి 10 బాల్స్ వరుసగా వేయవచ్చు. అయితే మ్యాచ్ మొత్తంలో ఒక బౌలర్ 20 బంతులు మాత్రమే వేయాలి.

ప్రతీ ఓవర్‌కు అంటే.. పది బాల్స్ కు ఒకసారి ఎండ్ మార్చుకునే వీలుంటుంది. ది హండ్రెడ్ టైటిల్‌తో ఈ కొత్త ఫార్మాట్ క్రికెట్ ప్రపంచానికి మరో సరికొత్త ఆటను పరిచయం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్రికెట్ అనాలసిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -