జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ కలిసి నటించిన చిత్రం `అక్వామేన్`. వార్నర్ బ్రదర్స్ వారి డి.సి.కామిక్స్ రూపొందించిన భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో `సముద్రపుత్రుడు` పేరుతో ఎన్.వి.ఆర్.సినిమా బ్యానర్‌పై ఎన్.వి.ప్రసాద్ భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. యాక్షన్ ప్యాక్డ్ అడ్వంచరస్ చిత్రమిది. జేసన్ మమోవా టైటిల్ రోల్‌లో కనిపిస్తారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
జేసన్ ఫ్రెండ్ మేర పాత్రలో అంబర్ కనిపిస్తారు. చైనాలో విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 13 సాయంత్రం ప్రీమియర్ షోలతో ఇండియా వైడ్ డిసెంబర్ 14న భారీ ఎత్తున విడుదలవుతోన్న `అక్వామేన్` సినిమా ప్రెస్ మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా.. ఎన్.వి.ఆర్.సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- “ది కంజురింగ్, ది కంజురింగ్ 2, ప్యూరియస్ 7 వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు జేమ్స్ వాన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాను అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. అమెరికా కంటే వారం ముందుగానే భారతదేశంలో సినిమా విడుదలవుతుంది. ఇలాంటి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్న సైజు బాహుబలిలా సినిమా మెప్పిస్తుంది. సముద్రంలో సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి“ అన్నారు.