భారీ రేటుకు “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” శాటిలైట్‌ రైట్స్..

241
- Advertisement -

ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియెట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్రోడ‌క్ష‌న్ నెం-3గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోటి 43 ల‌క్ష‌లకు సాటిలైట్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Prema Katha Chitram 2

ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌”ప్రేమ కథా చిత్రం 2″ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న న్యూయ‌ర్ ప్ల‌స్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాదించిందో అంద‌రికి తెలుసు.. అదే హ‌వాని ట్రేడ్‌లో సీక్వెల్‌గా వ‌స్తున్న ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 కూడా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. హింది శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్‌ని కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌ల‌కి కొనుగొలు చేశారు. ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే సుమంత్ అశ్విన్ హీరోగా, సిధ్ధి ఇద్నాని మ‌రో హీరోయిన్‌గా చేస్తున్నారు. విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీనుల మ‌ద్య వ‌చ్చే కామెడి ఆక‌ట్ట‌కుంటుంది. జ‌న‌వ‌రిలో విడుదల కానున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని అతి త్వ‌ర‌లో విడుదల చేస్తాము.. పూర్తి స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న మా ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2 అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.

Prema Katha Chitram 2

న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నందిత శ్వేత‌, సిధ్ధి ఇద్నాని, కృష్ణ తేజ‌, విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు..సాంకేతిక నిపుణులు :కెమెరామెన్ – సి. రాం ప్రసాద్, ఎడిటర్ – ఉద్ధవ్ య‌స్‌.బి, సంగీతం – జె.బి, డైలాగ్ రైటర్ – గ‌ణేష్‌,లిరిక్ రైట‌ర్‌- అనంత్ శ్రీరామ్,కాస‌ర్ల్య శ్యామ్‌, పూర్ణా చారి,ఆర్ట్ – కృష్ణ‌,కో ప్రొడ్యూసర్స్ – ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి,నిర్మాత – ఆర్. సుదర్శన్ రెడ్డి,దర్శకుడు – హరి కిషన్.

- Advertisement -