TDP:పొత్తు ఎఫెక్ట్.. ‘లెక్కలు’ ఛేంజ్!

26
- Advertisement -

టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత సీట్ల సర్దుబాటు ఎలా ఉండనుందనేది క్యూరియాసిటీని పెంచుతున్న అంశం. దీనిపై ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో పాటు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రజా ప్రతినిధులు గజేంద్ర సింగ్ షెకావత్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా భేటీ అయ్యారు. దాదాపు 8 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీట్ల కేటాయింపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుండగా టీడీపీ బీజేపీ పార్టీలు మిగిలిన స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొదట జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాలు మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికి బీజేపీ కోసం మూడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీటును త్యాగం చేసినట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ విషయానికొస్తే 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. దీంతో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి రావడంతో త్వరలోనే అధికారిక ప్రకటన చేయనునట్లు తెలుస్తోంది. అయితే బీజేపీకి పది అసెంబ్లీ కేటాయించడంపై టీడీపీ జనసేన పార్టీలో అసమ్మతి సెగలు రగులుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కమలం పార్టీకి ఏపీలో ఏమాత్రం పట్టు లేదు. అసలు పొత్తులో భాగం కాకపోతే ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకునే అవకాశం లేదు.

మరి అలాంటి బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు, ఆరు లోక్ సభ సీట్లు కేటాయించడం ఎంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఏ ఏ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేనప్పటికి టీడీపీలో సీటు కోసం ఎదురు చూసే కొందరు ఆశావాహులకు ఇది ఏ మాత్రం మింగుడు పడని విషయం. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగే అవకాశం లేకపోలేదు. అయితే వైసీపీని గద్దె దించే లక్ష్యంలో కొన్ని సీట్లు త్యాగం చేయక తప్పదని, అందువల్ల అందరూ కలిసికట్టుగా కూటమి విజయానికి దోహదపడాలని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సూచిస్తున్నారు. మరి పొత్తు కారణంగా మారిన ఈ లెక్కలు కూటమికి ఎలాంటి ఫలితాలను తీసుకొస్తాయో చూడాలి.

Also Read:Modi:పెద్ద ప్లానే ఇది.. మోడీజీ!

- Advertisement -