పేపర్ లీకేజీ కేసు…నారయణే సూత్రధారి!

70
Narayana
- Advertisement -

ఏపీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో నారాయణ విద్యాసంస్థల అధినేత,మాజీ మంత్రి, టీడీపీ నేత నారయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.నారాయణ ఆదేశాలతోనే ప్రశ్నపత్రాలను లీక్‌ చేశామని ఈ కేసులో ఇటీవల అరెస్టయిన తిరుపతి నారాయణ స్కూల్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌రెడ్డి, డీన్‌ బాల గంగాధర్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడించడం గమనార్హం. మాల్‌ప్రాక్టీస్‌ యాక్ట్‌ 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పేపర్‌ లీకేజ్‌ చైన్ నారాయణే లీడ్ చేస్తున్నారని తెలిపారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి . విచారణలో ఆధారాలు దొరికినందుకే నారాయణను అరెస్ట్ చేశామని …పేపర్ లీకేజీ కేసులో మూలాలన్నీ నారాయణ వైపే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల్లో బాగా చదివేవాళ్లను ఓ సెక్షన్.. చదవని వాళ్లను మరో సెక్షన్ పెడతారని వెల్లడించారు.

అడ్మిషన్లు పెంచుకోవడం,న్విజిలేటర్లను లోబర్చుకుని పేపర్‌ లీకేజీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. ర్పొరేట్ స్కూల్స్‌లో జీరో ఫెయిల్యూర్‌ ఉండాలన్నదే వాళ్ల లక్ష్యమన్నారు.

- Advertisement -