జనసేనలో అంతర్మథనం.. అందుకే ఆ నిర్ణయం!

69
- Advertisement -

ఏపీలో రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. రోజురోజుకు బలం పెంచుకుంటూ వైసీపీ, టీడీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. దాంతో పవన్ కూడా పార్టీని బలోపేతం చేయడంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ వేస్తున్న ప్రతి అడుగు కూడా సక్సస్ అవుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి జనసేనపై పడింది. పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొనున్నారు ? జనసేన ప్రభావం ఏ పార్టీ పై అధికంగా ఉంటుంది ? ఇంతకీ జనసేన స్టాండ్ ఏంటి అనే ప్రశ్నలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడు కూడా హాట్ హాట్ చర్చలకు దారితీస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంచితే జనసేనలో అంతర్మథనం మొదలైందా ? తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయమే అందుకు కారణమా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..

ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు ను నియమించడంతో అందరిలోనూ ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. పోలిటికల్ గా పెద్దగా యాక్టివ్ గా లేని నాగబాబును కార్యదర్శిగా ప్రకటిచడం ఏంటని అందరిలోనూ ఇదే ఆలోచన. కాగా నాగబాబు 2019 ఎన్నికల నాటి నుంచి పతిలో ఉంటున్నప్పటికి పార్టీలో తనదైన ముద్ర వేయడంలో వెనుకబడే ఉన్నారు. కానీ జనసేనపార్టీలో పవన్ తరువాత ఎవరు అంటే.. టక్కున నాదెండ్ల మనోహర్ పేరే వినిపిస్తుంది. పార్టీకి సంబంధించిన అన్నీ పనులు, కార్యకలాపాలు, కార్యాచరణ అంశాలు నాదెండ్ల ను చూసుకుంటూ వచ్చారు. పవన్ అందుబాటులో లేని సమయాల్లో అంతా తానై పార్టీ బాద్యతలు తీసుకునే వారు నాదెండ్ల.. దాంతో జనసేనలో అంతా నేనే అనే రీతిలో నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నట్లు జనసేన వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో నాదెండ్ల కాంగ్రెస్ లో ఉన్నప్పుడూ పెద్దగా పాపులారిటీ లేదు.

కానీ జనసేనలో చేరిన తరువాత నాదెండ్లకు ప్రజల్లో మంచి పాపులారిటీ రావడంతో పాటు పవన్ తరువాతి స్థానం నాదెండ్ల దే అనే స్థాయికి చేరుకున్నారు. అయితే పవన్ తో చర్చించాల్సిన చాలా విషయాలు నాదెండ్ల సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వినికిడి. అందుకే అనూహ్యంగా పవన్ ప్రధాన కార్యదర్శి పదవిని తన అన్న నాగబాబు కు కట్టబెట్టరాని ప్రచారం జరుగుతోంది. ఇకపై జనసేనలో పవన్ తరువాత నాగబాబే అన్నీ విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. నాదెండ్ల కూడా పవన్, నాగబాబు ఆదేశాలతోనే పని చేయాల్సి ఉంటుంది. అయితే ప్రధాన కార్యదర్శి పదవి నాగబాబుకు ఇవ్వడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు పెదవి విరుస్తున్నారు. పవన్ కూడా కుటుంబ రాజకీయాలకు తెరతీశారని కొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రదాన కార్యదర్శి పదవి నాగబాబుకు ఇవ్వడం వెనుక పార్టీలో నెలకొన్న అంతర్మథనమే కారణం అని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి..

- Advertisement -