ఏపీలో నవరత్నాల పాలన..

11
- Advertisement -

ఏపీలో నవరత్నాల పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన నజీర్..నవరత్నాలతో ఏపీ ప్రజలకు డైరెక్టుగా నిధులు అందించామన్నారు.జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో ఉందన్నారు.

పరిశ్రమలు , వ్యవసాయం, సేవా రంగంలో గణనీయమైన అభివృద్దిని సాధించినట్టుగా గవర్నర్ వివరించారు. మన బడి , నాడు-నేడు ద్వారా తొలి దశలో రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ చేపట్టామన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. 2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహలను అందిస్తున్నామని గవర్నర్ వివరించారు. మత్సకారులు చనిపోయే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచామన్నారు.

వైఎస్సార్ బీమా పథకం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు బీమా అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -