జనవరి 26 అంటే ఆ రోజు గణతంత్ర దినోత్సవం అని చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడు. భారతదేశం రాజ్యంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు. గురువారం దేశ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, ఈ సందర్భంగా ఏపీ డీజీపీ సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 26ని ఆయన స్వాతంత్ర దినోత్సవంగా పేర్కొన్నారు
ప్రత్యేక హోదా కోసం ఏపీ యువత జనవరి 26న శాంతియుతంగా నిరసన చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నిరసనకు ఎటువంటి అనుమతి లేదని ఏపీ డిజివి తెలిపారు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు ఛానల్ తో ఆయన మాట్లాడుతూ.. జనవరి 26న ఇండిపెండెన్స్ డే… కాబట్టి పోలీసులందరూ.. ఆ వేడుకల భద్రతలో నిమగ్నమై ఉంటారు. అందుకోసం ఈ నిరసన వాయిదా వేసుకోవాలని యువతను కోరారు.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. బాధ్యతాయుతమైన పదవీలో ఉన్న వ్యక్తికి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర్య దినోత్సవానికి తేడా తెలియదా అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఏపీ డీజీపీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జోకులు వేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను ఏపీ డీజీపీ మించిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.