పీపుల్స్‌ స్టార్‌కి ఏపీ సీఎం జగన్‌..అదిరిపోయే ఆఫర్..!

420
jagan r narayanamurthy
- Advertisement -

విప్లవ సినిమాలకు కేరాఫ్ పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయణమూర్తి. మాదాల రంగారావు తర్వాత సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై సినిమాలు తీస్తు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తికి జగన్‌ బంపర్ ఆఫర్ ఇచ్చారట.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నారాయణమూర్తికి వైసీపీ టికెట్ ఆఫర్ చేశారట జగన్‌. తుని నుంచి పోటీచేయాలని జగన్ కోరారట. కానీ జగన్‌ ఆఫర్‌ని నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో కూడా నారాయణమూర్తికి వివిధ పార్టీలు టికెట్ ఇస్తామని ఆఫర్ చేశాయి. కాకినాడ నుంచి బరిలో దిగాలని టీడీపీ నేతలు పలుమార్లు కోరారట. ఇక చిరంజీవి సైతం తాను స్ధాపించిన పీఆర్పీ నుంచి పోటీచేయాలని కోరినా ఆయన తిరస్కరించాడట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ప్రజలతో ఉంటున్నా. ఉద్యమ సినిమాలు తీస్తున్నా.. అంతకంటే ఏం కావాలి అని వారికి చెప్పారట నారాయణమూర్తి.

- Advertisement -