“సాహో” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

327
Sahoo
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈమూవీని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. సుజిత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలయిన ఫస్ట్ లుక్ ను మంచి రెస్పాస్ వస్తుంది. జూన్ 5న ఈద్ సందర్భంగా ఈసినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈటీజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అమాంతం పెరిగింది.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు సాహో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 నుంచి 115కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. వరల్డ్ వైడ్ గా తెలుగు రైట్స్ రూ.150 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అన్ని భాషలతో కలుపుకుంటే రూ.300 నుంచి రూ. కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రీ రిలిజ్ బిజినెస్ ఈవిధంగా ఉంటే.. సినిమా విడుదల తర్వాత మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -