ప్రమాద స్ధలాన్ని పరిశీలించిన ఏపీ సీఎం జగన్..

447
jagan

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన బోటు ప్రమాద స్ధలాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు ఏపీ సీఎం జగన్‌. సీఎంతో పాటు మంత్రులు సుచరిత,అనిల్ కుమార్ ఉన్నారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్న జగన్ అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

మరోవైపు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దవళేశ్వరం ప్రాజెక్టు గేట్లు మూసివేసి గాలిపు చర్యలు ముమ్మరం చేశారు.

బోటు ప్రమాద ఘటన వివరాల కోసం అధికారులు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూముల ద్వారా ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కల్పించారు.

కాకినాడ – 18004253077

రాజమహేంద్రవరం – 0883 2442344

రంపచోడవరం – 1800 4252 123

అమలాపురం ఆర్డీవో – 0885 6233100

కాకినాడ ఆర్డీవో – 0884 2368100

రంపచోడవరం ఆర్డీవో – 0885 7245166

విశాఖ కలెక్టరేట్‌ – 1800 425 00002

ప.గో. కలెక్టరేట్‌ – 1800 233 1077

మచిలీపట్నం కలెక్టరేట్‌ – 08672 252847