కాంతారా భేష్‌: అనుష్క

159
- Advertisement -

రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కిన చిత్రం కాంతారా. కన్నడలో సెన్సేషన్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాపై ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగునాట శనివారం విడుదలైన ఈ మూవీకి విమర్శకులే కాదు టాలీవుడ్ సెలబ్రెటీలు బ్రహ్మారథం పడుతున్నారు.

తాజాగా ఈ సినిమాపై స్పందించారు నటి అనుష్క శెట్టి. కాంతారా సినిమా నాకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటులకు , నిర్మాతలకు , సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. ఇటువంటి సినిమా అందించినందుకు రిషబ్ శెట్టికి ధన్యవాదాలు తెలిపారు. దయచేసి ఈ సినిమాని థియేటర్లలో చూడండి అని తెలిపారు అనుష్క.

ఇటీవల ఈ సినిమాను హీరో ధనుష్, రానా అభినందించారు.

- Advertisement -