పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ప్రకాష్ చిక్ బరైక్ గురువారం తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గత వారం రోజుల్లోనే పార్టీ ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ ల రాజీనామాల తర్వాత ఇది మూడవ రాజీనామా కావడం గమనార్హం.
బరైక్ త్వరలోనే రాజ్యసభ చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా సమర్పించనున్నారు. బరైక్ రాజీనామాతో రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) బలం 10 మంది సభ్యులకు పడిపోనుంది.
అయితే పార్టీ కష్టాలు ఇక్కడితో ముగిసేలా లేవని నివేదికలు సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరో ముగ్గురు టిఎమ్‌సి రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
Also Read:టీమిండియాకు భారీ షాక్

