టీఆర్‌ఎస్‌లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే..

248
MLA Banoth HariPriya
- Advertisement -

లోక్‌సభ,ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. రోజుకోకరు కాంగ్రెస్ నుండి వలస వెళ్లుతున్నారు. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు ముఖ్య నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లాంటి ముఖ్య నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కారెక్కనున్నట్లు విశ్వసనీ వర్గాల సమాచారం. ఇక ఇదే వరుసలో ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తాజాగా ప్రకటించారు.

MLA Banoth HariPriya

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్దాల చరిత్ర ఉన్న ఇల్లందు ప్రాంతంతో పాటు గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కేసీఆర్‌కు ఉన్న విజన్ తనను ఆకట్టుకుందని, ఆయన బాటలో నడిచి ‘బంగారు తెలంగాణ’ సాధనలో భాగమవుతానని అన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన ప్రాంత అభివృద్ధిపై కేసీఆర్‌తో చర్చించానని, స్వార్థ రాజకీయాల కోసం కాకుండా, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నన్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల మంచి కోసం.. నియోజక వర్గ అభివృద్ధి కోసం .. నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. అందరి నిర్ణయం మేరకే నేను కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణలో భాగం అవుతా. అని తెలిపింది.

- Advertisement -