టీఆర్ఎస్‌ నాయకులపై దాడిని ఖండించిన ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్‌..

217
anil kurmachalam
- Advertisement -

సిద్దిపేటలో టి.ఆర్.యస్ నాయకుల పై బీజేపీ దాడిని ఖండించింది ఎన్నారై టి.ఆర్.యస్ సెల్.దుబ్బాక లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు సిద్ధిపేట లోని స్వర్ణ ప్యాలెస్ లో టి.ఆర్.యస్ నాయకులు క్రాంతి కిరణ్ (ఎమ్మెల్యే), వేముల వీరేశం (మాజీ ఎమ్మెల్యే) ల పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు ఎన్‌ఆర్‌ఐ టీఆర్ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం.

ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ని, పోలీసులని డిమాండ్ చేస్తున్నామని అనిల్ కూర్మాచలం తెలిపారు.

- Advertisement -