సెకండ్ వేవ్…నటి ఆండ్రియాకు కరోనా పాజిటివ్..

71
andrea

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రోజుకు 4 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారీన పడగా తాజాగా హాట్ బ్యూటీ ఆండ్రియాకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆండ్రియా.. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్‌లో క్షేమంగా ఉన్నానని తెలిపింది. మీరూ కూడా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని వెల్లడించింది ఆండ్రియా. యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్ గా ఆండ్రియా పాల్గొంది.