జబర్ధస్త్ నుంచి యాంకర్ రష్మీ ఔట్… ఈ వార్త ఇప్పుడు రష్మీ అభిమానులకు మింగుడు పడడం లేదు… జబర్ధస్త్ నుంచి రష్మీ తప్పుకుంటే మరి ఆమె ప్లేస్ లో ఎవరు యాంకర్ గా రాబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
రష్మీని జబర్దస్త్ షో నుంచి తప్పించి యాంకర్ హరితేజకు అవకాశం ఇవ్వాలని జబర్ధస్త్ షో యాజమాన్యం మల్లెమాల టీం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రష్మీని తప్పిస్తే ఆమె ప్లేస్ లో యాంకర్ హరితేజ రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ ముందు వరకు కూడా హరితేజ పెద్దగా చాలామందికి తెలియదు.
‘అ..ఆ’ మూవీ లో సమంత పక్కన నటించి పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నప్పటికీ , బిగ్ బాస్ షో తో మాత్రం బాగా పాపులర్ అయ్యింది. అసలు ఈమే బిగ్ బాస్ విన్నర్ అవుతారని అంత భావించారు కానీ చివరి నిమిషం లో ఆ ఛాన్స్ కోల్పోయింది.
అయితే ఈ షో తర్వాత అమ్మడికి వరుస సినిమా చాన్సులే కాక బుల్లితెర అవకాశాలు నిండుగా వస్తున్నాయట. ఇప్పటికే జెమినీ లో ఫిదా ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక జబర్ధస్త్ షోకు ఉన్న ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకొని హరితేజ కూడా ఆ షోకి యాంకర్‌గా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే రష్మీకి బిగ్‌బాస్ సీజన్2లో అవకాశం రావడంతో రష్మీ స్వయంగా తప్పుకొందని టాక్.
ఏదేమైనా మొత్తానికి జబర్దస్త్‌షో లో హరితేజ యాంకర్ గా అడుగు పెట్టడం మాత్రం దాదాపు ఖరారైందని సమాచారం. జబర్దస్త్ యాంకర్‌గా చేయడం వల్ల హరితేజ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయం. ముందు ముందు మరెన్ని సక్సెస్‌లను హరితేజ దక్కించుకుంటుందో చూడాలి.