యాంకర్ ప్ర‌దీప్‌పై కేసు పెట్టిన ద‌ర్శ‌కుడు..!

530
Anchor Pradeep

బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు నటించడానికి వీల్లేదంటూ, ఓ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే చిత్రం ప్రదీప్ హీరోగా రూపొందనున్నట్టు ఇటీవల ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే గతంలో ప్రదీప్ ఓ అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లారు.

pradeep copy

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్ ప్ర‌కారం జైలుకెళ్ళిన ప్రదీప్‌ సినిమాలో హీరోగా నటించ‌కూడ‌దు . కాని ఆయ‌న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలో హీరోగా న‌టించి, ఆ సినిమాని ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు.ఇది నిబంధ‌న‌ల‌కి విరుద్ధం.

ఆయ‌న‌పై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన సునిశిత్ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 31న తాను టీవీ చూస్తుండగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసిందని తెలిపారు సునిశిత్‌. యువ ద‌ర్శ‌కుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్నారు పోలీసులు.