అలాంటి వారిని వదలొద్దు.. అనసూయ ట్వీట్‌

268
anchor anasuya
- Advertisement -

అనసూయ… తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తన అందం, అభినయం, వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులను తన మాటల చాతుర్యంతో అలరిస్తు, బుల్లితెరపై యాంకరింగ్‌తో, అటు వెండితెరపై తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న అనసూయ అంటే లొట్టలేసుకుని కళ్లప్పగించి చూసే కుర్రకారు ఎందరో. నిత్యం వార్తలల్లో నిలుస్తూ సోషల్‌మీడియా వేదికగా ప్రతినిత్యం ప్రేక్షకులతో మమేకమయ్యే అనసూయ ఎప్పుడు ఏ రకమైన పోస్టులు పెడుతుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తు ఉంటారు.

Anasuya-Bharadwaj-

ఆ మద్య నడిరోడ్డుపై ఓ బాలుడి ఫోన్ పగులగొట్టి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. గతంలో ఒకసారి ఓ ప్రైవేట్‌ ఈవెంటుకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యింది ఈ భామ. అయితే తాజాగా అనసూయ రోడ్లమీద జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకమైన జనాల ప్రాణాలు పోతున్నాయని, అజాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తూ ఇతరుల ప్రాణాలను బలిగొంటున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్‌ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తాను బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2 దారిలో వెళుతుండ‌గా, ప‌క్క‌న కారు డ్రైవ‌ర్ చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తున్న వీడియోను ట్యాగ్‌ చేసింది.

Anasuya-Bharadwaj

తాను కూడా అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేస్తున్న వారి వల్ల ప్రమాదానికి గురయ్యాను. ఇలాంటి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్న వారిని వదలొద్దు. అజాగ్రత్తగా వాహనాలు నడుపుతున్న వారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా అని ఆమె ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ప్రమాదం వల్లే తన తలకు తీవ్రగాయాలయ్యాయని, తన కారు ఎయిర్‌ బెలూన్‌ వల్ల తాను బతికి బయటపడ్డానని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తున్నవారిని ఉపేక్షించొద్దని అనసూయ పేర్కొంది.

- Advertisement -