బిగ్‌బాస్‌లో స్టెప్పులతో అదరగొట్టిన సామ్రాట్‌, దీప్తి

224
bigg boss

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణతో ప్రసారం చేయబడుతున్న బిగ్‌ బాస్‌ 2 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో వివాదాలు, విమర్శలతో పాటు సరదా టాస్క్‌తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారం వారం ఎలిమినేషన్స్‌తో ఎప్పుడు ఏ సెలెబ్రిటీ ఎలిమినేషన్‌ అవుతారోనని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ 2 సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లోని 16 మంది కంటెస్టెంట్స్‌లో ఇప్పటికే పలువురు ఎలిమినేట్‌ అయ్యారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇప్పటికే 39 ఎపిసోడ్స్‌ పూర్తయ్యాయి. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి ఇస్తున్న సరదా టాస్క్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

bigg boss

టాస్క్‌లో భాగంగా లగ్జరీ బడ్జెట్‌ తో మంగ‌ళ‌వారం ‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’ షూటింగ్ ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ అమిత్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్ దీప్తి, కెమెరా మెన్ రోల్ రైడాలు ఆర్టిస్టుల‌తో న‌వ‌ర‌సాలు పండిస్తూ షూటింగ్ చేశారు. ఇందులో బాబుగోనినేని ప్రోడక్షన్‌ చీఫ్‌గా వ్యవహరించారు. ఈ టాస్క్‌ బిగ్‌ బాస్‌ ప్రేక్షకులని తన్మయత్వానికి గురయ్యేలా చేసింది. ఈ సినిమాలో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ కౌశ‌ల్, నందిని మ‌ధ్య రొమాన్స్‌, త‌నీష్‌, సామ్రాట్‌ల మ‌ధ్య యాక్ష‌న్ సీన్స్ త‌దిత‌ర స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. కొన్ని స‌న్నివేశాల‌ని కామెడీగా తెర‌కెక్కించి ఫ‌న్ క్రియేట్ చేశారు. ఈ సినిమాకు తేజస్వీ కొరియోగ్రాఫర్‌ గా వ్యవహరించారు.

bigg boss

తెజస్వీ కొరియోగ్రాఫర్‌ లో రింగ రింగ అనే ఐటెం సాంగ్‌కి దీప్తి సున‌య‌న‌, సామ్రాట్‌లు అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టారు. ఈ సాంగ్ సినిమాకే స్పెష‌ల్ హైలైట్ అవుతుంద‌ని టీం బావించింది. ఈ సాంగ్‌ లో హీరో, హరోయిన్లుగా నటించిన కౌశల్, దీప్తి సునయన కాస్టూమ్స్‌ అదిరిపోయాయి. అయితే ఈ సాంగ్‌ డ్యాన్స్‌ ఫర్మామెన్స్‌లో హీరోయిన్‌ దీప్తి సునయన హీరో సామ్రాట్‌ కు ముద్దు ఇవ్వడం చెప్పుకోదగిన విషయం. ఆ తర్వాత తనీష్‌, సామ్రాట్‌ల మద్య ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కించారు. అయితే ఈ వారం ఎలిమినేషన్స్‌లో 5గురు ఇంటి సభ్యులు నామినేట్‌ అయ్యారు. వారిలో తేజస్వీ, దీప్తి, రోల్‌ రైడా, సామ్రాట్‌, తనీష్‌లు ఎలిమినేషన్‌ వరుసలో ముందులైన్‌లో ఉన్నారు. మొత్తానికి రసవత్తరంగా సాగుతున్న బిగ్‌ బాస్‌ సీజన్‌2లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఆసక్తి బిగ్‌బాస్‌ ప్రేక్షకుల్లో నెలకొంది.