బంపర్‌ ఆఫర్‌..నో చెప్పిన రంగమ్మత్త..!

362
anasuya
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది.రంగస్థలం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ…కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకుసాగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అనసూయకు సంబంధించి మరో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

అనసూయ కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకోసం బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భారీ ఆఫర్ ను కూడా అనసూయ తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -